pancharama Kshetra yatra -Five Sacred Shiva Temple
Overview
Pancharama Kshetra Yatra అనేది ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన శైవ యాత్ర. ఆంధ్రప్రదేశ్లోని ఐదు పవిత్ర పంచారామ క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. 1. అమరారామం – అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం అమరావతిలో కృష్ణా నది తీరాన ఉన్న ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడు, అమ్మవారు బాలచాముండేశ్వరిగా కొలువై ఉన్నారు. 2. ద్రాక్షారామం – ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పురాతనమైన ప్రసిద్ధ శైవక్షేత్రం. పంచారామాలలో ముఖ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. East Godavari District 3. క్షీరారామం – పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లులో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం పంచారామాలలో ఒకటి. ఇక్కడ స్వామివారిని క్షీర రామలింగేశ్వరుడుగా భక్తులు దర్శించుకుంటారు. 4. సోమారామం – భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం భీమవరం గునుపూడిలో ఉన్న ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. సోమేశ్వర స్వామిగా పరమశివుడిని భక్తులు పూజిస్తారు. 5. కుమారారామం – సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం సామర్లకోటలోని ఈ పురాతన ఆలయం పంచారామాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు కుమార భీమేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు.
Reviews
No reviews yet — be the first to share your experience.